
నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ కోసం నొయిడాలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్(పీజీఐసీహెచ్) అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జులై 14.
- పోస్టులు: గైనకాలజిస్ట్ 01, జనరల్ సర్జన్ 01, డెర్మటాలజిస్ట్ 01, జనరల్ ఫిజిషియన్ 01, సైకియార్టిస్ట్ 01.
- ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మెడికల్ డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
- అప్లికేషన్ ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.5000. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.3500.
- సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.