రాఖీకి పోస్టల్ శాఖ రెడీ..విదేశాలకు ఈజీగా రాఖీలు పంపేలా సర్వీసులు

రాఖీకి పోస్టల్ శాఖ రెడీ..విదేశాలకు ఈజీగా రాఖీలు పంపేలా సర్వీసులు

హైదరాబాద్ సిటీ, వెలుగు: దేశ విదేశాల్లో ఉంటున్న సోదరులకు రాఖీ పంపేందుకు పోస్టల్​శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి గల్ఫ్ దేశాల్లో తెలంగాణ నుంచి వెళ్లిన కార్మికులు, ఉద్యోగస్తులు కలిపి దాదాపు 10 లక్షల మందికి పైగానే ఉన్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్, మలేషియా, సింగపూర్ లాంటి దేశాల్లో కూడా మనవాళ్లు ఎక్కువే. 

వీరికి ఇక్కడున్న వారి సోదరీమణులు రాఖీలు పంపేందుకు అబిడ్స్​జీపీవోతో పాటు సికింద్రాబాద్, ఖైరతాబాద్, సైఫాబాద్, కాచిగూడ, ఖైరతాబాద్, మాసాబ్ ట్యాంక్ లాంటి ప్రధాన పోస్టాఫీసుల్లో ప్రత్యేక కౌంటర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వానాకాలం కావడంతో రాఖీలు పాడవకుండా వాటర్‌ప్రూఫ్ ఎన్వలప్‌లను వాడుతోంది. అమెరికా, యూకే , ఆస్ట్రేలియా, కెనడా, గల్ఫ్ దేశాలతో సహా 100కు పైగా దేశాలకు రాఖీ కవర్లు , గిఫ్ట్ పార్సిళ్లను స్పీడ్​గా పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.