నాలుగు రోజులుగా చీకట్లో వంద గ్రామాలు

V6 Velugu Posted on Jul 27, 2021

  • నాలుగు రోజులుగా చీకట్లో పల్లెలు
  • ఆసిఫాబాద్​ జిల్లాలో కరెంట్​ కష్టాలు
  • వంద గ్రామాలకు పవర్ ​కట్​
  • నీళ్ల కోసం జనరేటర్లు, ఆయిల్​ ఇంజన్లు 
  • అటకెక్కిన లాంతర్లు, పెట్రోమాక్స్​లకు గిరాకీ

ఆసిఫాబాద్, వెలుగు: ఇటీవలి వర్షాలు, వరదల కారణంగా పోయిన కరెంట్ ఇంకా రాలేదు.  ఆసిఫాబాద్​ జిల్లా సిర్పూర్ నియోజక వర్గంలోని సుమారు వంద గ్రామాల్లో 4 రోజులుగా పవర్​ కట్​ కొనసాగుతోంది.  దీంతో ఆయా ఏరియాల్లో తాగునీటి సప్లై నిలిచిపోయింది. సెల్​ఫోన్లు మూగబోయాయి.  జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏ పనీ చేసుకోలేకపోతున్నారు. ‘టెక్నాలజీ పెరిగింది.. ఇట్లా ప్రాబ్లమ్​ వస్తే అట్లా సాల్వ్​ చేస్తామ’ని ట్రాన్స్​కో ఆఫీసర్లు చెప్తున్నా ఆసిఫాబాద్​ జిల్లాలో ప్రతి వానకాలం ఇక్కట్లు తప్పట్లేదు. చిన్న వానొచ్చినా.. గట్టి గాలి వీచినా పవర్​ సప్లై ఆగిపోతోంది. ఇక్కడి సబ్ స్టేషన్లలో సమస్యలొస్తే రిపేర్లకు వారాలకు వారాలు పడ్తోంది. కూలిన కరెంట్​ పోల్స్​ను నిలబెట్టడానికి రోజులు గడుస్తున్నాయి. 

వంద గ్రామాల్లో అంధకారం 
కాగజ్​నగర్ డివిజన్ లోని సిర్పూర్(టి) మండలం లోనవెల్లి, లక్ష్మీపూర్ వాగు దగ్గర 33 కేవీ లైన్​కు సంబంధించిన 15 కరెంట్ పోల్స్​ మొన్నటి వరదల వల్ల విరిగిపడ్డాయి. ఈ రూట్​లోని కౌటాల, చింతలమానేపల్లి, బెజ్జూరు మండలాలకు పవర్​ సప్లై నిలిచిపోయింది. జిల్లా వ్యాప్తంగా 338 కరెంటు స్తంభాలు డ్యామేజ్ కాగా, 116 ట్రాన్స్​ఫార్మర్లు నీట మునిగాయి. వానాకాలం, సీజనల్ వ్యాధులు ప్రబలే టైమ్​లో రోజుల తరబడి కరెంట్ లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇన్వర్టర్లు, బ్యాటరీలు కూడా పని చేయకపోవడంతో ఆయిల్​ ఇంజన్లను, జెనరేటర్లను కిరాయికి తెచ్చుకుంటున్నారు. జనరేటర్లకు గంటకు రూ. వెయ్యి చొప్పున వసూలు చేస్తున్నారు. కొన్ని చోట్ల ఒక డ్రమ్ము నీళ్లు నింపితే రూ. 100 వరకు తీసుకుంటున్నారు. ఇండ్లల్లో దీపాలు, క్యాండిళ్లు వెలిగిస్తున్నారు. ఎన్నడో అటకెక్కిన లాంతర్లు, పెట్రోమాక్స్​ లైట్లను మళ్లీ వాడుతున్నారు. ఏసీలు, కూలర్లకు అలవాటు పడిన జనాలు ముఖ్యంగా చిన్నపిల్లలు రాత్రిళ్లు నిద్ర పట్టక అవస్థలు పడుతున్నారు. కరెంట్​ మీదే ఆధారపడిన చిన్న వ్యాపారులు, మెకానిక్​లు తీవ్రంగా నష్టపోతున్నారు. 

కాలమే దైనా.. కటింగ్ మామూలే..
రెప్పపాటు టైమ్​ కూడా పవర్​ కట్​ ఉండదన్న సర్కారువారి మాట ఆసిఫాబాద్​ జిల్లాలో అనుభవంలోకి రావడంలేదు. మొదటినుంచి ఇక్కడ కోతలు ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. వాన పడిందంటే ఇక గంటల పాటు కరెంట్ కరెంట్​ ఉండదు. ఆఫీసర్లు స్థానికంగా ఉండకపోవడంవల్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతోంది.  కరెంటు లేక తాగునీటి స్కీమ్​లు పనిచేయడంలేదు. చాలా గ్రామాల్లో నల్లాలు రాక ప్రజలు తిప్పలు పడుతున్నారు.  వ్యవసాయ బావుల నుంచి మంచినీళ్లు తెచ్చుకోవాల్సివస్తోంది. మెయింటెన్స్​కు లక్షల్లో ఖర్చు చేసినట్టు ​అధికారులు చెప్తుంటారు. కానీ ఊళ్లలో కరెంట్ వైర్లు చేతికందే ఎత్తులో వేళ్లాడుతున్నా పట్టించుకోవడంలేదు. 

ఒకే లైన్​తో 250 ఊళ్లకు కరెంట్​ 
కాగజ్ నగర్ మండలం ఈస్గాం, ఆసిఫాబాద్​లో రెండు 32 కేవీ సబ్ స్టేషన్లు ఉన్నాయి. కాగజ్​నగర్​ పారిశ్రామిక కేంద్రంగా కాగా.. ఈస్గాం పరిధిలోని ఊళ్లన్నీ గుట్టల మధ్య ఉన్నవే. ఈ గ్రామాలకు విద్యుత్ సరఫరా చేయడంలో అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఈస్గాం సబ్​స్టేషన్​ నుంచి 135 కిలో మీటర్ల వరకు ఒకే లైను ద్వారా సిర్పూర్ నియోజకవర్గంలోని 250 గ్రామాలకు కరెంటు అందిస్తున్నారు. ఎక్కడ బ్రేక్​ పడ్డా అన్ని ఊళ్లకు కరెంటు సప్లై ఆగిపోతోంది. సమస్యను గుర్తించి రిపేర్లు చేసేందుకు కొన్ని గంటల సమయం పడుతోంది. దీనికి తోడు స్టాఫ్​ కొరత వేధిస్తోంది. జిల్లాలో 328 పోస్టులకు గాను 207 మంది పని చేస్తుండగా 121 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

Tagged Telangana, power cut, kagajnagar, Rains, Asifabad

Latest Videos

Subscribe Now

More News