శ్రీశైలం ప్లాంట్​లో పవర్​ జనరేషన్ ​స్టార్ట్

శ్రీశైలం ప్లాంట్​లో పవర్​ జనరేషన్ ​స్టార్ట్

1, 2 యూనిట్లను ప్రారంభించిన మంత్రి జగదీశ్​రెడ్డి

అమ్రాబాద్, వెలుగు: శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలోని 1, 2వ యూనిట్లను సోమవారం మంత్రి జగదీశ్​రెడ్డి ప్రారంభించారు. అంతకుముందు మొదటి, రెండవ యూనిట్లను మంత్రి, ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్​పరిశీలించారు. విజయదశమి సందర్భంగా ప్లాంట్ లో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం 1, 2 యూనిట్లను బటన్ నొక్కి మంత్రి ప్రారంభించారు. రెండు యూనిట్ల ద్వారా 300 మెగావాట్ల కరెంట్​అందుబాటులోకి వస్తుందని అంచనా. అనంతరం మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ ఆగస్టు 20న బ్యాటరీలను మారుస్తుండగా జరిగిన అగ్నిప్రమాదం కారణంగా ఏడుగురు సిబ్బంది, ఇద్దరు ప్రైవేట్​వ్యక్తులు మరణించారని అన్నారు. ప్రమాదంలో నాలుగో ప్లాంటు పూర్తిగా కాలిపోగా 1, 2, 3, 5, 6 యూనిట్లు దెబ్బతిన్నాయన్నారు. ఇంజనీర్లు, ఇతర సిబ్బంది నిరంతరం మరమ్మతులు కొనసాగించడంతో రెండు నెలల్లోనే రెండు యూనిట్లు అందుబాటులోకి  వచ్చాయన్నారు. 3, 5, 6 యూనిట్లను కూడా త్వరలోనే ప్రారంభించనున్నట్లు చెప్పారు. ప్రమాదంలో 4వ యూనిట్ కు అధిక నష్టం వాటిల్లిందని, దానిని వచ్చే ఏడాది మే నెలలోపు అందుబాటులోకి తెచ్చేలా చూస్తామన్నారు.  అన్ని యూనిట్లలో నష్టం దాదాపు రూ.100 కోట్లలోపే ఉండే అవకాశం ఉందని వివరించారు. 4 వ యూనిట్ పూర్తిగా దెబ్బతినడంతో దానికి కొంత ఎక్కువ ఖర్చు కావొచ్చని, 1, 2 యూనిట్లలో వాటిల్లిన నష్టం  కేవలం రూ. 1 కోటి లోపేనని తెలిపారు.

ప్రెస్​కు నో పర్మిషన్​

శ్రీశైలం విద్యుత్​ ప్లాంట్ యూనిట్ల ప్రారంభ​కార్యక్రమానికి అధికారులు ప్రెస్​ను అనుమతించలేదు. మంత్రి పర్యటనలో ప్రెస్​ను  అనుమతిస్తే ప్లాంట్​లో ప్రమాదానికి కారణాలపై ఏర్పాటైన నిపుణుల కమిటీ, సీఐడీ విచారణలో ఏం తేలిందో ప్రశ్నించే అవకాశం ఉండడంతో ప్రింట్, ఎలక్ట్రానిక్​ మీడియాకు అనుమతి ఇవ్వకుండా గేట్​వద్దే నిలిపేశారు. మంత్రి ప్రోగ్రామ్​అయిపోగానే కాంపౌండ్​లోకి అనుమతించారు.

For More News..

దుబ్బాకలో టీఆర్ఎస్ ఓడిపోతుందని కేసీఆర్‌కు తెలుసు

నాపై దాడి చేయిస్తవా? కేసీఆర్​.. నీ సంగతి తేలుస్తా!

ఫ్రెండ్స్​తో కలిసి చెల్లిని గ్యాంగ్​రేప్​ చేసిన అన్న