
ప్రభాస్ సినిమా అప్‌డేట్స్ కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తారో తెలిసిందే. ప్రభాస్, మారుతి సినిమా విషయంలోనూ అదే జరుగుతోంది. ఇంతవరకు అఫీషియల్‌గా ఏ విషయమూ ప్రకటించకపోవడంతో క్యూరియాసిటీ అంతకంతకి పెరిగిపోతోంది. దానికి తోడు రోజుకో వార్త పుట్టుకొస్తూ ఉండటంతో ఏది నిజమో, ఏది కాదో తెలియక కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్‌లో ఓ సినిమా రానున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇదో సూపర్బ్ ఫన్ ఎంటర్‌టైనర్ అని, ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారని ఇప్పటికే రకరకాల వార్తలు వచ్చాయి. ఇప్పడు మరో కొత్త న్యూస్ చక్కర్లు కొడుతోంది.
ఈ సినిమాని ఈ నెలలోనే సెట్స్‌కి తీసుకెళ్లబోతున్నారట. ఫస్ట్ షెడ్యూల్ కోసం ప్రభాస్ వారం రోజులు కేటాయించాడని, అక్టోబర్ 17న షూటింగ్ స్టార్ట్ చేయడం ఖాయమని అంటున్నారు. మొత్తం ముగ్గురు హీరోయిన్లు ఉంటారట. మాళవికా మోహనన్, నిధి అగర్వాల్ ఆల్రెడీ ఫిక్సయ్యారట. మెయిన్ హీరోయిన్‌గా కాజల్‌ని తీసుకున్నారని అంటున్నారు. అయితే వీటిలో ఏది ఎంత నిజమో తెలియాలంటే టీమ్ నుంచి ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వాల్సిందే.