ప్రభాస్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ఇవాళ (సెప్టెంబర్ 29) రాజా సాబ్ ట్రైలర్ ట్రీట్

ప్రభాస్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ఇవాళ (సెప్టెంబర్ 29)  రాజా సాబ్ ట్రైలర్ ట్రీట్

ప్రభాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హీరోగా మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘ది రాజా సాబ్’.  ఇప్పటికే విడుదలైన టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మంచి రెస్పాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాగా,  తాజాగా ఆడియెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు  ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు మేకర్స్. 

సోమవారం (సెప్టెంబర్ 29) సాయంత్రం 6 గంటలకు ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ మోస్ట్ అవైటెడ్ అనౌన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ప్రభాస్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  ప్రభాస్, సంజయ్ దత్ కాంబో స్టిల్ ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఆసక్తిని పెంచుతోంది.  ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దర్శకుడు మారుతి ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. 

3 నిమిషాల 30 సెకన్లు  ఉన్న ఈ  ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను   హారర్, యాక్షన్ సన్నివేశాలతో కట్ చేసినట్లు తెలుస్తోంది.  మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో  బాలీవుడ్ నటుడు సంజయ్ దత్  కీల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాత్రలో కనిపించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.  ఇక డిసెంబర్ 5న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని వాయిదా వేస్తూ..  సంక్రాంతి కానుకగా జనవరి 9న వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా విడుదల చేయబోతున్నారు.