తొగుట, వెలుగు : తొగుట మండల కేంద్రంలో బుధవారం మొక్కజొన్న రైతులు తమ ధాన్యంతో వచ్చిన ట్రాక్టర్లను రోడ్డుపై నిలిపి రోడ్డును దిగ్బంధించారు. రెండు రోజుల క్రితం మొక్కజొన్నను తీసుకుని మార్కెట్‌కు వచ్చినా కొనుగోళ్లు నిలిచిపోయాయని తెలిపారు.
మార్కెట్ గేటుకు తాళం వేసి ఉండటంతో రెండు రోజులుగా ట్రాక్టర్ల కిరాయి భారం పడుతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనతో మార్కెట్ సిబ్బంది గేటుకు తాళం తీశారు. మార్కెట్‌లో ఇప్పటికే లారీలు నిలిచిపోవడంతో లోపలికి వాహనాలు వెళ్లేందుకు స్థలం లేక ఇబ్బంది ఏర్పడిందని, అందుకే ముందుగా అనుమతి ఇవ్వలేదని మార్కెట్ సిబ్బంది తెలిపారు.

