యశ్ హీరోగా గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ‘టాక్సిక్’ మూవీ రిలీజ్ మరోసారి వాయిదా పడింది. జూన్ 4న ఈ చిత్రం విడుదల కావల్సి ఉండగా, ఆ డేట్‌కు రావడం లేదని హీరో యశ్ ప్రకటించాడు. సినిమా కాన్ ఈవెంట్‌లో ‘టాక్సిక్’కు అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన స్పందన తమ బాధ్యతను మరింత పెంచిందని, అందుకే గ్లోబల్ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలియజేశాడు.
షూటింగ్ ఇప్పటికే పూర్తయిందని, ప్రస్తుతం ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్, కీలకమైన అంతర్జాతీయ భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడంపై ఫోకస్ పెట్టామని చెప్పాడు. ఇక మార్చి 19న రావాల్సిన ఈ చిత్రాన్ని జూన్4కి వాయిదా వేయగా, ఇప్పుడు మరోసారి పోస్ట్‌పోన్ చేశారు. నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, తారా సుతారియా ఇతర పాత్రలు పోషిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి.

