V6 News

కొత్త తరహా కంటెంట్‌‌‌‌‌‌‌‌తో ‘ఫస్ట్ టైం’

కొత్త తరహా కంటెంట్‌‌‌‌‌‌‌‌తో ‘ఫస్ట్ టైం’

సౌరబ్ ధింగ్ర హీరోగా హేమంత్ ఇప్పలపల్లి దర్శకనిర్మాతగా తెరకెక్కించిన చిత్రం ‘ఫస్ట్ టైం’. అనిక్క విక్రమన్ హీరోయిన్. అఖిల్ సార్థక్ మైమ్ గోపి, శివ, భూపాల్ రాజు, గాయత్రి గుప్త, అన్నపూర్ణమ్మ, ఇతర పాత్రలు  పోషించారు.  మంగళవారం ఈ మూవీ ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాంచ్ చేసిన పాయల్ రాజ్‌‌‌‌‌‌‌‌పుత్‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ ‘ట్రైలర్ ఎంతో కొత్తగా అనిపించింది. విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ షాకింగ్‌‌‌‌‌‌‌‌గా అనిపించాయి.

కంటెంట్ ఉన్న సినిమాలకు విజయాన్నిచ్చే తెలుగు ఆడియన్స్‌‌‌‌‌‌‌‌ ఈ సినిమాకు కూడా మంచి విజయాన్ని అందిస్తారని కోరుకుంటున్నాను’ అంటూ టీమ్‌‌‌‌‌‌‌‌కు బెస్ట్ విషెస్ చెప్పింది.  మన దేశానికి సంబంధించిన ఎన్నో మూలాలను ఇందులో చూపించామని,  కొత్త తరహా కంటెంట్‌‌‌‌‌‌‌‌తో ఆకట్టుకుంటుందని దర్శకనిర్మాత హేమంత్ చెప్పారు.   హీరో సౌరబ్ ధింగ్ర,   నటి గాయత్రి గుప్తా,  దర్శకనిర్మాత బెల్లం రామక్రిష్ణ రెడ్డి,   ‘దేవగుడి’ చిత్ర నటుడు అభినవ్ శౌర్య తదితరులు పాల్గొన్నారు.