సువిక్షిత్, గీతికా రతన్ జంటగా కార్తికేయ కొమ్మి రూపొందించిన చిత్రం ‘దూరదర్శని’. కలిపింది ఇద్దరిని అనేది క్యాప్షన్. జయ శంకర్ రెడ్డి.ఎం, పాటిమీది సంతోష్ నిర్మించారు. మే 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా బుధవారం ప్రెస్‌మీట్ నిర్వహించారు.
హీరో సువిక్షిత్ మాట్లాడుతూ.. ‘అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు బిక్షాటన చేస్తున్న ఓ పెద్దాయన చెప్పిన కథ ఇది. తన కొడుకు వల్ల ఆయన బిక్షాటన ఎందుకు చేయాల్సి వచ్చింది అనే కాన్సెప్ట్‌తో దీన్ని తెరకెక్కించాం’ అని చెప్పాడు.
ఇలాంటి ప్రేమకథలు అరుదుగా వస్తాయి అని హీరోయిన్ గీతికా చెప్పింది. మనసులను హత్తుకునే సినిమా అవుతుందని నటుడు జెమిని సురేష్ అన్నాడు. లవ్‌స్టోరీతో పాటు తల్లిదండ్రులకు, యూత్‌కు, సమాజానికి నచ్చే అంశాలు ఇందులో ఉన్నాయని దర్శకుడు చెప్పాడు. లావణ్య రెడ్డి, కిట్టయ్య, తేజ, బాలరాజు పాల్గొన్నారు.

