హైదరాబాద్, వెలుగు: టెన్త్ ఫలితాల్లో శ్రీచైతన్య విద్యార్థులు జయకేతనం ఎగురవేశారు. శ్రీచైతన్య స్కూల్‌కు చెందిన స్టూడెంట్ 597 మార్కులతో అగ్రస్థానంలో నిలిచారని విద్యాసంస్థల డైరెక్టర్ సీమ తెలిపారు. 580కిపైగా మార్కులను 829 మంది, 570కంటే మార్కులను 2,303మంది, 560కంటే ఎక్కువ మార్కులను 3,954 మంది, 550కంటే ఎక్కువ మార్కులను 5,521 మంది స్టూడెంట్లు సాధించారని చెప్పారు.
శ్రీచైతన్య స్కూల్ విద్యార్థుల యావరేజ్ మార్కు 532గా, మొత్తం ఉత్తీర్ణత శాతం 99.75గా నమోదైందని పేర్కొన్నారు. మెజారిటీ జిల్లాలు, మండలాలు, పట్టణాలు, సిటీల్లో శ్రీచైతన్య స్కూల్ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారని వివరించారు.
తమ విద్యార్థులు టాప్ మార్కులు సాధించారని వెల్లడించారు. ఇటీవల విడుదలైన సీబీఎస్‌ఈ టెన్త్ ఫలితాల్లో శ్రీచైతన్య స్కూల్‌కు చెందిన ఇద్దరు స్టూడెంట్లు 500కు 499 మార్కులు సాధించారని తెలిపారు. మెజారిటీ రాష్ట్రాల్లో టాప్ మార్కులతో పాటు ఓవరాల్‌గా 100% పాస్ సాధించారని చెప్పారు. టెన్త్‌లో ఇంతటి గొప్ప విజయానికి కారణమైన విద్యార్థులు, తల్లిదండ్రులు, బోధనా సిబ్బందిని ఆమె అభినందించారు

