సలార్ రిలీజ్ పోస్ట్పోన్? కన్ఫర్మ్ చేసిన యంగ్ హీరో

సలార్ రిలీజ్ పోస్ట్పోన్? కన్ఫర్మ్ చేసిన యంగ్ హీరో

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ సలార్(Salar).  కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth neel) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా సెప్టెంబర్ 28 ఎప్పుడు వస్తుంది అంటూ రోజులు లెక్కపెట్టుకుంటున్నారు. అయితే లేటెస్ట్ గా సలార్ రిలీజ్ పోస్ట్ పోన్ అవుతుందంటూ కిరణ్ అబ్బవరం మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

లేటెస్ట్ గా యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) నటిస్తున్న రూల్స్ రంజన్ మూవీ సెప్టెంబర్ 28న రిలీజ్ అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. అలాగే ప్రభాస్ సలార్ మూవీ కూడా పోస్ట్ పోన్ అవుతుండటంతో..హాలిడే డేట్ కూడా ఉండటంతో.. రూల్స్ రంజాన్ రిలీజ్ చేస్తున్నట్లు  కిరణ్ పేర్కోన్నారు. భారీ బడ్జెట్ తో వస్తోన్న ప్రభాస్ సలార్ మూవీ రిలీజ్ డేట్ ను ..ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా ఫిక్స్ చేసుకోలేదు. ఇక కిరణ్ అబ్బవరం రూల్స్ రంజాన్ మూవీ సెప్టెంబర్ 28కి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోవడంతో సలార్ రిలీజ్ డేట్ చేంజ్ అయినట్టు తెలుస్తుంది. అది కూడా డిసెంబర్కు. ఈ న్యూస్ చూసిన ఆయన ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు. ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న సినిమా పోస్ట్ పోన్ అయింది అంటూ వస్తున్న వార్తలతో చాలా డిసప్పాయింట్ అవుతున్నారు.

ఇక మరోపక్క ఈ సినిమా పోస్ట్ పోన్ అవడానికి ఛాన్స్ లేదంటూ మరికొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే సలార్ సినిమా ఓవర్సీస్ బుకింగ్స్ మొదలవ్వడానికి రెడీగా ఉన్నాయి. అంతేకాదు.. సెప్టెంబరు 6న సలార్ ట్రైలర్ కూడా  రాబోతుందని అంటున్నారు. మరి ఇలాంటి టైంలో రిలీజ్ పోస్ట్ పోన్ ఎలా కుదురుతుంది అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాలంటే నిర్మాణ సంస్థ నుండి అధికారిక ప్రకటన రావాల్సిందే.