సలార్తో హాలీవుడ్ ఎంట్రీ.. సాలిడ్గా ప్లాన్ చేసిన ప్రశాంత్

సలార్తో హాలీవుడ్ ఎంట్రీ.. సాలిడ్గా ప్లాన్ చేసిన ప్రశాంత్

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ చూపంతా హాలీవుడ్ పైనే ఉంది. బాహుబలి(Bahubali), ఆర్ఆర్ఆర్(RRR) సినిమాలతో హాలీవుడ్ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన తెలుగు ఇండస్ట్రీ.. కొత్తగా వస్తున్న సినిమాలతో హాలీవుడ్ బాక్సాఫీస్ ను సైతం షేక్ చేయాలని ట్రై చేస్తోంది. ఇందులో భాగంగా మేకర్స్ కూడా అందుకు తగ్గట్టుగానే ప్లాన్ చేసుకుంటున్నారు. 

ALSO READ:పూనమ్ కౌర్ ట్వీట్ కు.. RGV రెస్పాండ్.. ఏంటంటే?

తాజాగా ప్రభాస్(Prabhas) హీరోగా వస్తున్న సలార్(Salaar) సినిమాను హాలీవుడ్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట దర్శకుడు ప్రశాంత్ నీల్(Prashanth neel). ఇండియాలో విడుదలైన 15 రోజుల తరువాత ఇంగ్లీష్ డబ్బింగ్ తో హాలీవుడ్ లో కూడా రిలీజ్ కానుంది సలార్ సినిమా. బాహుబలి తరువాత ప్రభాస్ క్రేజ్ వరల్డ్ వైడ్ గా రీచ్ అయ్యింది. ఇటీవల కల్కి 2898 AD(Kalki 2898 AD) ఫస్ట్ గ్లింప్స్ సినిమా కోసం కామిక్ కాం ఫెస్టివల్ కు హాజరయ్యారు ప్రభాస్. దీంతో ప్రభాస్ వరల్డ్ వైడ్ ట్రెండ్ అయ్యారు. ఇప్పుడు ఈ క్రేజ్ నే క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు సలార్ మేకర్స్. అందుకే ఈ సినిమాను హాలీవుడ్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ALSO READ:పుష్ప2 షూటింగ్కు బ్రేక్.. ఆలస్యం కానున్న ఐకాన్ స్టార్ మూవీ

ఇక సలార్ సినిమా విషయానికి వస్తే.. కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్(Shruthi haasan) హీరోయిన్ గా నటిస్తున్నారు. మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్(Prudviraj sukumaran) విలన్ గా నటిస్తుండగా.. జగపతి బాబు(Jagapathi babu) మరో కీ రోల్ లో కనిపిస్తున్నారు. రెండు పార్టులుగా వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ కానుంది.