పూనమ్ కౌర్ ట్వీట్ కు.. RGV రెస్పాండ్.. ఏంటంటే?

 పూనమ్ కౌర్  ట్వీట్ కు.. RGV  రెస్పాండ్.. ఏంటంటే?

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) ఇండస్ట్రీలోనే ప్రత్యేకమైన పేరు. ఆ పేరు వెనుకాల ఉండే విజన్ చాలా అరుదు. RGV చేసే ట్వీట్స్  ఫ్యాన్స్ కు ఏదో రకంగా కిక్క్ ఇస్తుంటాయి. లేటెస్ట్ గా మరో ట్వీట్ చేశారు. రీసెంట్ గా  టాలీవుడ్ ప్రముఖ నటి పూనమ్ కౌర్( Poonam Kaur ) సోషల్ మీడియాలో బ్రో మూవీను ఉద్దేశించి ..ఈ మధ్య పాలిటిక్స్ కామెడీగా మారాయి.. కామెడీ మాత్రం సీరియస్ గా మారిపోయింది..అంటూ పూనమ్ ట్వీట్ చేయాగా.. RGV స్పందిస్తూ.. లేదు సిస్, నేను నిజానికి రాజకీయం సినిమాగా మారిందని, సినిమా రాజకీయంగా మారిందని అనుకుంటున్నాను.. అంటూ ట్వీట్ చేయడంతో క్షణాల్లో సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది. 

ALSO READ:అలాంటి సినిమాలకు నో : మాళవిక మోహనన్

వీరి చర్చంతా లేటెస్ట్ గా రిలీజ్ అయినా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) బ్రో మూవీ వివాదం. ఈ సినిమాలో కమెడియన్ పృథ్వీ రాజ్..AP మినిస్టర్ అంబటి రాంబాబును.. శ్యామ్ బాబు గా ఇమిటేట్ చేశారంటూ పెద్ద రచ్చ జరుగుతున్న విషయం తెలిసేందే. దీంతో పూనమ్ ట్వీట్ బ్రో మూవీను ఉద్దేశించే ట్వీట్ చేశారంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేయగా.. RGV కూడా స్పందించడంతో వీరి  ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి . 

వర్మ ఈ మధ్య కాలంలో ఎక్కువగా పొలిటికల్ నేపథ్యంతో ఉన్న సినిమాలు ఎక్కువగా తీస్తున్న విషయం తెలిసేందే. ఇక రాంగోపాల్ వర్మ లేటెస్ట్ మూవీ వ్యూహం(Vyuham) కూడా సోషల్ మీడియా లో బాగానే హాట్ టాపిక్ గా నిలిచింది. సీఎం జగన్(CM Jagan) రాజకీయ జీవితంపై వస్తున్న ఈ మూవీ త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది.