
పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న స్టార్, 500 కోట్ల భారీ బడ్జెట్ సినిమా.. ఏ హీరోయిన్ మాత్రం అందులో చాన్స్ వస్తే వద్దనుకుంటుంది చెప్పండి. కానీ కచ్చితంగా నో చెప్పేస్తా అంటోంది మాళవిక మోహనన్. పేట, మాస్టర్ లాంటి తమిళ చిత్రాలతో తెలుగులోనూ మంచి గుర్తింపును అందుకుంది మాళవిక. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇకపై కథకు ప్రాధాన్యత గల చిత్రాల్లో మాత్రమే నటిస్తానని చెప్పింది మాళవిక. ఆ కథలో తన క్యారెక్టర్‌కు ఇంపార్టెన్స్ లేకపోతే.. అది 500 కోట్ల భారీ బడ్జెట్ సినిమా అయినా సరే దానికి నో చెప్తాను తప్ప అందులో నటించనని స్పష్టం చేసింది.
ఒకవేళ ఆ సినిమాలు విడుదలయ్యాక సూపర్ హిట్ అయినా కూడా.. తన పాత్రకు గుర్తింపు రాదని, అందుకే ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నానని తేల్చి చెప్పింది. ఇక ప్రభాస్‌తో మారుతి తెరకెక్కిస్తున్న సోషియో ఫాంటసీ మూవీలో హీరోయిన్‌గా నటిస్తున్న మాళవిక.. మరోవైపు తమిళంలో విక్రమ్ సినిమా ‘తంగళన్’, హిందీ చిత్రం ‘యుద్ర’లో నటిస్తోంది.