హారర్, కామెడీ మూవీలో ప్రభాస్ ?

హారర్, కామెడీ మూవీలో ప్రభాస్ ?

ఆదిపురుష్, సాలార్, ప్రాజెక్ట్‌‌‌‌ కె అంటూ వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. వీటితో పాటు మారుతి డైరెక్షన్‌‌‌‌లో హారర్ కామెడీ మూవీ కూడా చేస్తున్నాడు. ఈ సినిమాని ఇంతవరకు అఫీషియల్‌‌‌‌గా అనౌన్స్ కూడా చేయలేదు. అయితే సీక్రెట్‌‌‌‌గా షూటింగ్ స్టార్టయిందని, ఆల్రెడీ మొదటి షెడ్యూల్ కూడా పూర్తయిందని తెలిసింది. వారం రోజుల పాటు కీలక సన్నివేశాలు తీసిన తర్వాత నిన్న ‘సాలార్’ సెట్స్‌‌‌‌లో జాయినయ్యాడు ప్రభాస్.  శరవేగంగా షూటింగ్ జరుగుతోందని సోషల్ మీడియాలో అప్‌‌‌‌డేట్ ఇచ్చింది టీమ్. ప్రశాంత్ నీల్ దర్శకుడు కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. శ్రుతీహాసన్ హీరోయిన్‌‌‌‌. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. విశేషమేమిటంటే.. సంవత్సరానికి ఒక సినిమాతో ఆడియెన్స్‌‌‌‌ ముందుకొచ్చే ప్రభాస్.. వచ్చే యేడు కనీసం మూడు మూవీస్‌‌‌‌తో ప్రేక్షకులను పలకరించేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడట. సంక్రాంతికి ‘ఆదిపురుష్’ రాక ఫిక్సయ్యింది. ‘సాలార్’ను వచ్చే యేడు సెప్టెంబర్ 28న రిలీజ్ చేయనున్నట్టు కూడా అనౌన్స్ చేశారు. నాగ్ అశ్విన్ తీస్తున్న ‘ప్రాజెక్ట్‌‌‌‌ కె’ని కూడా నెక్స్ట్ ఇయర్ ప్రభాస్ పుట్టిన రోజున విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు నిర్మాత అశ్వనీదత్ ప్రకటించారు. ఒకవేళ ఇది రెడీ కాకపోయినా ఆ సమయానికి మారుతి మూవీ విడుదలకు సిద్ధమవుతుందని అంటున్నారు. అదే నిజమైతే ప్రభాస్ కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఇదో పెద్ద రికార్డ్ అవుతుంది.