ప్రభాస్ మోకాలికి సర్జరీ.. మారుతి సినిమా కోసమేనా?

ప్రభాస్ మోకాలికి సర్జరీ.. మారుతి సినిమా కోసమేనా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో ఒకటి ప్రశాంత్ నీల్(Prashanth neel) దర్శకత్వంలో వస్తున్న సలార్(Salaar) కాగా.. మరొకటేమో నాగ్ అశ్విన్(Nag Ashwin) తెరకెక్కిస్తున్న కల్కి 2898 ఏడీ(Kalki 2898 AD). 

ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్నవే. అంతేకాదు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో అంచనాలు హాై లెవల్లో ఉన్నాయి. ఈ రెండు సినిమాలతో పాటు దర్శకుడు మారుతీ(Maruthi)తో మరో సినిమా చేస్తున్నారు ప్రభాస్. అయితే తాజాగా సమాచారం మేరకు ప్రభాస్ మారుతితో చేయబోయే సినిమా కోసం తన మోకాలికి సర్జరీ చేయించుకుంటున్నాడట. నిజానికి ప్రభాస్ చాలా కాలంగా మోకాలి నొప్పితో బాధపడుతున్నారు. కానీ వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉండటంతో సర్జరీ ని అశ్రద్ధ చేశారట. కానీ ఇప్పుడు ఆ నొప్పికి సర్జరీ చేయించుకోవడానికి ఫిక్స్ అయ్యారట ప్రభాస్.   

కారణం..  బాహుబలి(Bahubali) తరువాత ప్రభాస్ చేసిన సినిమాలో డాన్స్ కు పెద్దగా స్కోప్  లేదు. సాహో(Saaho), రాధే శ్యామ్(Radhe shyam), ఆదిపురుష్(Adipurush) ఈ సినిమాలన్నీ అదే కోవలోకి వస్తాయి. రానున్న రెండు సినిమాలు సలార్, కల్కి 2898  కూడా డాన్స్ బీట్స్ ఉండే సినిమాలు కాదు. కానీ మారుతితో ప్రభాస్ చేస్తున్న సినిమా పక్కా ఎంటర్టైనర్ మూవీ. ఈ సినిమాలో మాములు కమర్షియల్ సినిమాలో ఉండే అన్ని ఎలిమెంట్స్ ఉండనున్నాయి. అందుకే ఈ సినిమా కోసం డాన్స్ చేయడానికి ఇబ్బంది అవకుండా మోకాలికి సర్జరీ చేయించుకోవడానికి సిద్దమవుతున్నాడట ప్రభాస్. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.