ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా కీర్తిశ్వరన్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన చిత్రం ‘డ్యూడ్’. ఇటీవల విడుదలైన ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో సక్సెస్ టాక్‌ను తెచ్చుకుంది. తాజాగా రూ.వంద కోట్ల కలెక్షన్స్ రాబట్టిందని మేకర్స్ తెలియజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ప్రదీప్ రంగనాథన్ మాట్లాడుతూ ‘ఈ సినిమాకు రూ.వంద కోట్ల కలెక్షన్స్‌ని అందించిన ఆడియెన్స్‌కు థ్యాంక్స్. లవ్ టు డే.
డ్రాగన్ చిత్రాలను ఎంతగా ఆదరించారో.. అంతకంటే ఎక్కువగా ఈ సినిమాను ఆదరించారు’ అని చెప్పాడు. ఈ సక్సెస్‌ని సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని హీరోయిన్ మమిత బైజు, డైరెక్టర్ కీర్తిశ్వరన్ చెప్పారు. మా సంస్థలో మరో విజయాన్ని అందుకోవడం చాలా సంతోషంగా ఉందని నిర్మాత వై రవిశంకర్ అన్నారు. కార్యక్రమానికి హాజరైన నిర్మాత ఎస్‌కేఎన్ టీమ్‌ను అభినందించారు. మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి, రైటర్ కృష్ణ పాల్గొన్నారు.
