సమస్యలు పరిష్కరించకపోతే ప్రగతి భవన్ ను ముట్టడిస్తం

సమస్యలు పరిష్కరించకపోతే ప్రగతి భవన్ ను ముట్టడిస్తం

ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల్లోనే అభివృద్ధి కనిపిస్తుంది తప్ప... చేతల్లో లేదని  టీ.ఎన్.ఎస్.ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు  రవీందర్ రెడ్డి అన్నారు. విద్యారంగా సమస్యలు పరిష్కరించాలని టీ.ఎన్.ఎస్.ఎఫ్ ( తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ ) నాయకులు హైదరాబాద్ లక్డీకపూల్ లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాన్ని  ముట్టడించారు. ఈ నేపథ్యంలో స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ఈ సమస్యలపై ముఖ్యమంత్రికు నివేదిక ఇచ్చిన కూడా పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వం పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు లేవని, ఉపాధ్యాయుల కొరత ఉందని చెప్పుకొచ్చారు. వారం రోజులుగా ప్రభుత్వ పాఠశాలలో  టీ.ఎన్.ఎస్.ఎఫ్ నాయకులు సందర్శించి సమస్యలు తెలుసుకున్నామన్న ఆయన... విద్యార్థులకు ఇంకా పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదని... మధ్యాహ్నం భోజనం నాసిరకంగా పెడుతున్నారని ఆరోపించారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించకపోతే త్వరలోనే ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని రవీందర్ రెడ్డి స్పష్టం చేశారు. కాగా ఈ క్రమంలో ర్యాలీగా వచ్చిన వచ్చిన టీ.ఎన్.ఎస్.ఎఫ్ నేతలు.. ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కమిషనర్ కార్యాలయం ముందు బైటాయించారు. దీంతో భారీగా  పోలీసులు మోహరించి..  కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించిన నాయకులను అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.