ప్రపంచ శాంతి సభను విజయవంతం చేయండి

ప్రపంచ శాంతి సభను విజయవంతం చేయండి

హైదరాబాద్: అక్టోబర్ 2న జింఖానా గ్రౌండ్ లో ప్రపంచ శాంతి మహాసభలు నిర్వహిస్తున్నామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. మొత్తం 28 దేశాల అధినేతలు ఈ సభకి రానున్నారని పాల్ చెప్పారు. శనివారం సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజా గాయకుడు గద్దర్ తో కలిసి ప్రత్యేక పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడారు. ప్రపంచ శాంతి సభను అడ్డుకునేందుకు సీఎం కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తమ సభకు అనుమతి ఇవ్వడంలేదని పాల్ అన్నారు. 

ప్రపంచంలోని అన్ని సమస్యలకు ఆర్ధిక అసమానతలే కారణమని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. శాంతియుత వాతావరణం ఉన్నప్పుడే దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందని ఆయన తెలిపారు.  కులం, మతం, రాజకీయాలకు అతీతంగా జరిగే ఈ ప్రపంచ శాంతి మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.