ప్రకాష్ రాజ్ పై పోలీస్ కంప్లైంట్

ప్రకాష్ రాజ్ పై పోలీస్ కంప్లైంట్

దసరా నాడు హిందువులు జరుపుకునే ‘రామ్ లీలా’ పై నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన వివాదాస్పాద వ్యాఖ్యలు చేశారు. రామ్ లీలాను చైల్డ్ పోర్న్ తో పోల్చిన ప్రకాశ్ రాజ్ వీడియో ప్రస్తుతం వైరల్ అయ్యాయి. ఈ వీడియోలో అతను 2018వ సంవత్సరంలో మాట్లాడినట్లుగా ఉంది. దీంతో ఐదుగురు లాయర్లు సుప్రీం కోర్టులో కేసు వేశారు. ప్రకాశ్ రాజ్ మతపరమైన వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను రెచ్చకొడుతున్నారని చెప్పారు.

ఓ జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం… సుప్రీం కోర్టు లాయర్లయైన…జగ్గల్ కిషోర్ గుప్తా, కుల్ దీప్ రాయ్, వరుణ్ మిశ్రా, అభినవ్ పతక్, రుమా పతక్ లు ప్రకాష్ రాజ్ కు వ్యతిరేకంగా.. డిల్లీలోని తిలక్ నగర్ పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేశారు.