
భారీగా కురుస్తున్న వర్షాల వల్ల మేడిగడ్డకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. కాగా దీనిపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. త్వరలో మేడిగడ్డ బ్యారేజీని సందర్శిస్తానని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. ‘నిజం ఎప్పుడూ గెలుస్తుంది’ అని ట్వీట్ చేశారు.
ALSO READ : వినయ్ భాస్కర్ డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో డబ్బులు వసూలు చేసిండు : రాజేందర్ రెడ్డి
‘కాంగ్రెస్ కుట్రలను తట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టు నిలిచింది. మేడిగడ్డ బ్యారేజీ నిండుకుండలా మారింది. లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తుంది’ అంటూ బీఆర్ఎస్ పార్టీ పోస్ట్ చేసిన డ్రోన్ వీడియోపై X వేదికగా స్పందించారు.