
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ యంగ్ ఐస్ స్కేటర్ సూరపనేని ప్రణవ్ మాధవ్ షార్ట్ ట్రాక్ ఐస్ స్కేటింగ్ జూనియర్ వరల్డ్ కప్‌కు అర్హత సాధించాడు. నవంబర్‌లో కజకిస్తాన్‌లోని అస్తానాలో జరగనున్న ఈ గ్లోబల్ ఈవెంట్‌కు తెలంగాణ నుంచి క్వాలిఫై అయిన తొలి స్కేటర్‌గా నిలిచాడు. ఈ ఏడాది ఇండియా నుంచి ముగ్గురికి మాత్రమే చాన్స్ లభించగా.. అందులో 16 ఏండ్ల ప్రణవ్ కూడా ఉన్నాడు.
గత ఐదేండ్లుగా నిలకడగా నేషనల్ లెవెల్‌లో సత్తా చాటుతున్న ఈ కుర్రాడు ఈ ఏడాది డెహ్రాడూన్‌లో జరిగిన ఆసియా షార్ట్ ట్రాక్ చాంపియన్‌షిప్‌లో సిల్వర్ నెగ్గాడు. ఈ క్రమంలో జూనియర్ వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ టైమింగ్ మార్కు అందుకున్నాడు. ప్రస్తుతం సౌత్ కొరియాలో అడ్వాన్స్‌డ్ కోచింగ్ తీసుకుంటున్న ప్రణవ్ వింటర్ ఒలింపిక్స్‌లో ఇండియాకు ప్రాతినిధ్యం వహించడమే తన టార్గెట్‌గా పెట్టుకున్నాడు.