ఆసియా క్రీడల గోల్ఫ్ చరిత్రలో ఇండియా సరికొత్త అధ్యాయాన్ని సృష్టించింది. విమెన్స్ వ్యక్తిగత విభాగంలో గోల్ఫర్ ప్రణవి ఉర్స్ ఫైనల్ రౌండ్‌లో 70 స్కోరుతో స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. నాలుగు రోజుల్లో ప్రణవి 265 స్కోరు చేసింది.
ఆసియా క్రీడల గోల్ఫ్‌లో వ్యక్తిగత స్వర్ణం సాధించిన తొలి ఇండియన్ విమెన్ గోల్ఫర్గా ప్రణవి రికార్డులకెక్కింది. ఫైనల్ రౌండ్ ఆరంభంలో త్రిపుల్ బోగీ కారణంగా ఆమెకు ఎదురుదెబ్బ తగిలినప్పటికీ, ఒత్తిడిని జయించి అద్భుతమైన పునరాగమనం చేసింది.
కీలక క్షణాల్లో మూడు అద్భుతమైన బర్డీలు సాధించి ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది. ప్రణవి (70), అదితి అశోక్ (67), దీక్షా దాగర్ (77)తో కూడిన ఇండియా మెన్స్ టీమ్ సిల్వర్ మెడల్‌తో మెరిసింది.
