ప్రసార భారతిలో కాపీ ఎడిటర్ పోస్టులు భర్తీ

ప్రసార భారతిలో కాపీ ఎడిటర్ పోస్టులు భర్తీ

భారత ప్రభుత్వ సంస్థ ప్రసార భారతి కాపీ ఎడిటర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జులై 10.

పోస్టులు: కాపీ ఎడిటర్
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి జర్నలిజంలో డిప్లొమా(ఇంగ్లిష్ మీడియం) లేదా జర్నలిజంలో పీజీ డిప్లొమా(ఇంగ్లిష్ మీడియం) లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మాస్ కమ్యూనికేషన్​లో ఏడాది సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేసిన వారు అర్హులు. ఇంగ్లిష్ లాంగ్వేజ్​లో ప్రావీణ్యం కలిగి ఉండాలి. ప్రముఖ రేడియో/ టీవీ/ ప్రింట్ మీడియాలో రెండేండ్లు పని చేసిన అనుభవం ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్స్​లోనాలెడ్జ్ కలిగి ఉండటంతోపాటు ఇంగ్లిష్ టైపింగ్ లో ప్రావీణ్యం కలిగి ఉండాలి. 
వయోపరిమితి: 21 ఏండ్ల నుంచి 50 ఏండ్ల మధ్యలో ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
అప్లికేషన్లు ప్రారంభం: జూన్ 20.
లాస్ట్ డేట్: జులై 07 . 
అప్లికేషన్ ఫీజు:  జనరల్ అభ్యర్థుల రూ.354. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు రూ.266.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
పూర్తి వివరాలకు  www.newsonair.gov.in వెబ్ సైట్ లో చూడగలరు.