షర్మిలతో ప్రశాంత్ కిషోర్ టీమ్ భేటీ

షర్మిలతో ప్రశాంత్ కిషోర్ టీమ్ భేటీ
  • వచ్చే నెల 3న బీసీ గౌరవ సభ
  • వైఎస్సార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీపీ ఆధ్వర్యంలో కొడంగల్‌‌‌‌‌‌‌‌లోని కోస్గిలో మీటింగ్

హైదరాబాద్, వెలుగు: కొడంగల్‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గంలోని కోస్గి జూనియర్ కాలేజ్ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లో అక్టోబరు 3న ‘బీసీ గౌరవ సభ’ నిర్వహిస్తున్నట్టు వైఎస్సార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీపీ నేతలు తెలిపారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ లోటస్‌‌‌‌‌‌‌‌పాండ్‌‌‌‌‌‌‌‌లో సభకు సంబంధించిన పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బుధవారం ఆవిష్కరించారు. రాష్ట్రంలో బీసీలకు ఏడేండ్లుగా అన్యాయం జరుగుతోందని, బీసీల అభివృద్ధిని టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ సర్కారు పట్టించుకోవడం లేదని పార్టీ నేతలు మండిపడ్డారు. బీసీ ఓట్లతో గద్దెనెక్కిన కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. వారికి పదవులు దక్కకుండా మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. గొర్లు, బర్లు, చేపలకే బీసీలను పరిమితం చేస్తున్నారన్నారు. వారికి డబుల్‌‌‌‌‌‌‌‌ బెడ్‌‌‌‌‌‌‌‌ రూం ఇండ్లు ఇవ్వకుండా రాష్ట్ర సర్కారు ఆలస్యం చేస్తోందని మండిపడ్డారు. బీసీలు, ప్రజాస్వామిక వాదులు, ఉద్యమకారులు, విద్యావేత్తలు, మేధావులు, ప్రజలు ‘బీసీ గౌరవ సభ’కు తరలిరావాలని పిలుపునిచ్చారు. బీసీ నేతలు  నీలం ర‌‌‌‌‌‌‌‌మేశ్, రామ‌‌‌‌‌‌‌‌కోటి, శ్రీ‌‌‌‌‌‌‌‌రాములు తదితరులు పాల్గొన్నారు. కాగా, వైఎస్సార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల‌‌‌‌‌‌‌‌కు లోటస్ పాండ్‌‌‌‌‌‌‌‌లో ఐటీ వింగ్ క‌‌‌‌‌‌‌‌న్వీన‌‌‌‌‌‌‌‌ర్ ఇరుముళ్ల కార్తీక్ బుధవారం ట్రైనింగ్ ఇచ్చారు. సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియాను కరెక్ట్‌‌‌‌‌‌‌‌గా వాడుకుని పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రజాసమస్యలపై ప్రశ్నించాలని కార్తీక్‌‌‌‌‌‌‌‌ పిలుపునిచ్చారు. 

షర్మిలతో ప్రశాంత్ కిషోర్ టీమ్ భేటీ

వైఎస్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీపీ చీఫ్‌‌‌‌‌‌‌‌ వైఎస్ షర్మిలతో ఎన్నికల స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ టీమ్ భేటీ అయింది. పార్టీ విస్తరణ, భవిష్యత్ కార్యాచరణ, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం, క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై చర్చించారు.