మెడికల్ షాపుల్లోని ట్యాబ్లెట్లతో డ్రగ్స్ తయారీ

మెడికల్ షాపుల్లోని ట్యాబ్లెట్లతో డ్రగ్స్ తయారీ

హనుమకొండ, వెలుగు: మెడికల్​ షాపుల్లో దొరికే ట్యాబ్లెట్లతో డ్రగ్​ పౌడర్​ తయారు చేసి హైదరాబాద్​కు సప్లయ్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లాలకు చెందిన ఓ ఆర్ఎంపీని వరంగల్ టాస్క్​ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇంకో ఇద్దరినీ అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.2.13 లక్షల విలువైన ఒక కిలో డ్రగ్​పౌడర్​, 5 సెల్​ ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్​ ఫోర్స్​ అడిషనల్​ డీసీపీ వైభవ్​ గైక్వాడ్​ వివరాలు సోమవారం వెల్లడించారు. ఆర్​ఎంపీగా పనిచేస్తున్న కారంపూడి మండలం పెదకొదమగుండ్లకు చెందిన లింగాల సైదులు.. అదే మండలానికి చెందిన పెరుమాండ్ల వెంకటేశ్​ నడిపిస్తున్న మెడికల్ షాపు నుంచి ఆల్ప్రాజోలం ట్యాబ్లెట్​ను కొనుగోలు చేసి వాటితో డ్రగ్ పౌడర్ తయారు చేయడం ప్రారంభించాడు.

హైదరాబాద్​లో పెయింట్స్​ బిజినెస్​ చేసే తన బంధువు రాజశేకర్ని లక్ష్మణ్​ రావు, మెహిదీపట్నంలో డ్రైవర్​ గా పని చేసే పూసల చైతన్య కుమార్​ సాయంతో ఆ పౌడర్​ను కస్టమర్లకు చేరవేసేవాడు. న్యూఇయర్ వేడుకలప్పుడు అమ్మేందుకు డ్రగ్ పౌడర్​ను కారులో హైదరాబాద్​కు తరలిస్తుండగా హనుమకొండలోని అలంకార్​ జంక్షన్​ వద్ద టాస్క్​ ఫోర్స్​ పోలీసులు నిందితులను పట్టుకున్నారు. సైదులు, లక్ష్మణ్​రావు, చైతన్య కుమార్​ను అరెస్ట్ చేశారు. టాస్క్ ఫోర్స్ ఏసీపీ జితేందర్ రెడ్డి, సీఐ వెంకటేశ్వర్లు, ఏఏవో సల్మాన్ పాషా, సిబ్బంది సోమలింగం, మాధవరెడ్డి, 
స్వర్ణ తదితరులను అడిషనల్​ డీసీపీ వైభవ్​ గైక్వాడ్​ అభినందించారు.