- అనాథలు, వితంతువులు, ఒంటరి మహిళల బిల్లు పెట్టిన ఎంపీ
న్యూఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్ ఎంపీ కడియం కావ్య ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. అనాథలు, వితంతువులు, ఒంటరి మహిళల (రక్షణ, పునరావాసం, సంక్షేమం) బిల్లు – 2025కు రాష్ట్రపతి ఆమోదం లభించిందని శుక్రవారం లోకసభ సెక్రటేరియట్ అధికారికంగా ప్రకటించింది.
నిరుడు డిసెంబర్ 6న పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య రెండు ప్రైవేట్ మెంబర్ బిల్లులను ప్రవేశపెట్టారు. పూర్తి సమాచారం పొందిన అనంతరం రాజ్యాంగంలోని ఆర్టికల్ 117(3) ప్రకారం లోక్‌సభలో ఈ బిల్లును పరిశీలించేందుకు సిఫార్సు చేసినట్లు లోక్‌సభ సెక్రటేరియట్ ప్రకటించింది.
