కరేబియన్ దేశాల్లో రాష్ట్రపతి పర్యటన

కరేబియన్ దేశాల్లో రాష్ట్రపతి పర్యటన

కరేబియన్ దేశాల పర్యటనకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ బయల్దేరారు. రేపట్నుంచి ఈనెల 21 వరకు ఆయన సతీమణి సవిత సోమ్ నాథ్ తో కలిసి జమైకా, సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్ లలో పర్యటించనున్నారు. రాష్ట్రపతి ఈ దేశాల్లో పర్యటించడం ఇదే తొలిసారని విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి తెలిపారు. జమైకా గవర్నర్ జనరల్ పాట్రిక్ అలెన్ తో ప్రతినిధి స్థాయి చర్చలు జరపనున్నారు కోవింద్. జమైకా ప్రధాన మంత్రి ఆండ్రూ హోల్ నెస్ తో పాటు ఇతర ప్రముఖులను కలవనున్నారు. జమైకన్ పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశంలో రామ్ నాథ్ కోవింద్ ప్రసంగిస్తారు. సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్ ప్రధాని రాల్ఫ్ గోన్సాల్వేస్ తో పాటు ఇత ప్రముఖులతో రాష్ట్రపతి కోవింద్ చర్చలు జరపనున్నారు.

మరిన్ని వార్తల కోసం

సర్వే నంబర్ ఎంట్రీ చేస్తే చాలు.. ఆధార్​ సహా అన్నీ ఖుల్ల

కరోనాకు మరో కొత్త వ్యాక్సిన్