
హైదరాబాద్, వెలుగు : ఈ నెల 15న రాష్ట్రా ని కి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి పర్య టనకు సంబంధించిన ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమారి సెక్రటేరియెట్‌లో సోమవారం అధికారులతో సమీక్షించారు. 16న ఉపరాష్ట్రపతి కూడా వస్తారని.. ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంతరాలు లేకుండా చూసుకో వడంతోపాటు ముందుగానే తగిన రీతిలో అన్ని ఏర్పాట్లు చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డీజీపీ రవిగుప్తా, హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, జీఏడీ సెక్రటరీ రఘునందన్‌రావు, సీఎండీ టీఎస్‌పీడీసీఎల్ ముషారఫ్ పాల్గొన్నారు.