4న హైదరాబాద్​కు రాష్ట్రపతి ముర్ము

4న హైదరాబాద్​కు రాష్ట్రపతి ముర్ము

హైదరాబాద్, వెలుగు: వచ్చే నెల 4న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ కు రానున్నారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న అల్లూరి సీతారామరాజు జయంత్యుత్సవాలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ముర్ము ఈ ప్రోగ్రామ్ లో పాల్గొననున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి.