V6 News

భారత్ లో పర్యటిస్తున్న అర్జెంటీనా అధ్యక్షుడు

భారత్ లో పర్యటిస్తున్న అర్జెంటీనా అధ్యక్షుడు

ఢిల్లీ : అర్జెంటీనా అధ్యక్షుడు మార్సియో మర్సి భారత పర్యటనకు వచ్చారు. మార్సియో మర్సికి ఇవాళ రాష్ట్రపతి భవన్ లో ఘనస్వాగతం పలికారు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. తర్వాత మార్సియో మర్సికి గౌరవ వందనం సమర్పించాయి బలగాలు. 3 రోజుల పర్యటన కోసం నిన్న ఢిల్లీ వచ్చారు మార్సియో మర్సి. ఇవాళ ఉదయం ఢిల్లీలోని రాజ్ ఘాట్ లో మహాత్మాగాంధీ సమాధికి నివాళులర్పించారు. కాసేపట్లో ప్రధాని మోడీతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్నారు మర్సి.