12 యూనివర్సిటీలకు వీసీల నియామకం: లిస్ట్ ఇదే

12 యూనివర్సిటీలకు వీసీల నియామకం: లిస్ట్ ఇదే

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 12 సెంట్రల్ యూనివర్సిటీలకు వైస్‌ చాన్సెలర్ల నియామకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. కేంద్ర విశ్వవిద్యాలయాలకు విజిటర్ హోదాలో ఆయన ఈ నియామకాలను గురువారం చేపట్టినట్టు కేంద్ర విద్యా శాఖ వెల్లడించింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీతో పాటు హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్ము, జార్ఖండ్, కర్నాటక, తమిళనాడు సెంట్రల్ యూనివర్సిటీలకు వీసీలను నియమించారు. దేశంలో 22 సెంట్రల్ యూనివర్సిటీల్లో వీసీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అందులో 12  వీసీల నియామకానికి విజిటర్ ఆమోదం కూడా వచ్చిందని నిన్న (గురువారం) రాజ్యసభలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. ఈ మేరకు ఇవాళ దానికి సంబంధించిన ఉత్తర్వులు వచ్చాయి. అయితే బెనారస్ హిందూ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, జవహర్‌‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ, సాగర్ యూనివర్సిటీ, ఢిల్లీలోని రెండు సంస్కృత విశ్వ విద్యాలయాలతో పాటు పలు సెంట్రల్ వర్సిటీలకు రెగ్యులర్ వీసీలను నియమించాల్సి ఉంది.

12 యూనివర్సిటీలు, వీసీల లిస్ట్ ఇదే:

1. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ –    డాక్టర్ బి. జగదీశ్వర్‌‌ రావు

2. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్​ హర్యానా – డాక్టర్ టంకేశ్వర్ కుమార్

3. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్​ హిమాచల్ ప్రదేశ్ – ప్రొఫెసర్ సత్ ప్రకాశ్ బన్సల్

4. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్​ జమ్ము – డాక్టర్ సంజీవ్ జైన్

5. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జార్ఖండ్ – క్షితి భూషణ్ దాస్

6. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్​ కర్నాటక – ప్రొఫెసర్ బట్టు సత్యనారాయణ

7. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు – ప్రొఫెసర్ ముత్తుకళింగన్ కృష్ణన్

8. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ సౌత్ బీహార్ – ప్రొఫెసర్ కామేశ్వర్ నాథ్ సింగ్

9. నార్త్‌ ఈస్ట్రన్ హిల్ యూనివర్సిటీ – ప్రొఫెసర్ ప్రభాశంకర్ శుక్లా

10. గుంట్ ఘషిదాస్ యూనివర్సిటీ – డాక్టర్ అలోక్ కుమార్ చక్రవాల్

11. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ – ప్రొఫెసర్ సయ్యద్ ఐనుల్ హసన్

12. మణిపూర్ యూనివర్సిటీ – ప్రొఫెసర్ లోకేంద్ర సింగ్