‘పద్మ’ అవార్డులను ప్రదానం చేసిన రాష్ట్రపతి

‘పద్మ’ అవార్డులను ప్రదానం చేసిన రాష్ట్రపతి

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 2021 ఏడాదికి గానూ పద్మ అవార్డులకు ఎంపిక చేసిన వారికి పురస్కారాలను ప్రదానం చేసింది. లోక్ సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్‌.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా  పద్మ భూషణ్‌ అవార్డును అందుకున్నారు. పద్మ భూషణ్ పురస్కారానికి ఎంపికైన అస్సాం దివంగత మాజీ సీఎం తరుణ్ గొగోయ్‌ తరఫున ఆయన భార్య డాలీ గొగోయ్.. కేంద్ర మాజీ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తరఫున ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ అవార్డులను స్వీకరించారు. అలాగే ప్రముఖ శిల్పి సుదర్శన్ సాహూకు రాష్ట్రపతి పద్మ భూషణ్‌ పురస్కారాన్ని అందజేశారు. 

పద్మ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు పాల్గొన్నారు. అవార్డుల ప్రదానోత్సవంలో ఏడు పద్మ భూషణ్, 10 పద్మ విభూషణ్, 102 మందికి పద్మ శ్రీ అవార్డులు అందజేశారు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్. మరోవైపు అవార్డులు తీసుకున్న వారిలో 10 మంది మహిళలు ఉండగా... మరో 10 మంది NRIలతో పాటు... ఓ ట్రాన్స్ జెండర్ కూడా ఉన్నారు.

మరిన్ని వార్తల కోసం: 

బ్రాహ్మణులు, వైశ్యులు నా రెండు జేబుల్లో ఉన్నారు

భర్త కొట్టాడంటూ పోలీసులకు పూనమ్ పాండే ఫిర్యాదు

స్నేహితుడి భార్యతో ప్రేమ.. చివరకు జైలు