
ఈ మధ్య చాలా బైక్‌లు ట్యూబ్‌లెస్ టైర్లతోనే వస్తున్నాయి. వాటిలో ఎయిర్ ప్రెజర్ తగ్గితే వెంటనే గుర్తించలేం. అందుకే ఈ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్‌ని బిగించుకుంటే సరిపోతుంది. దీన్ని స్కైషాప్ అనే కంపెనీ తీసుకొచ్చింది. ప్యాక్‌లో రెండు సెన్సర్లతోపాటు ఒక డిజిటల్ డిస్‌ప్లే వస్తుంది. సెన్సర్లను టైర్లకు ఉండే ఎయిర్ వాల్వ్‌లకి బిగించాలి.
డిస్‌ప్లే యూనిట్‌ని హ్యాండిల్‌బార్‌కి బిగించుకోవచ్చు. దీన్ని అధునాతన హై–ప్రెసిషన్ జర్మన్ చిప్ టెక్నాలజీతో తయారుచేశారు. టైర్ ప్రెజర్‌ని అత్యంత కచ్చితత్వంతో చూపిస్తుంది. దీనివల్ల చాలావరకు ప్రమాదాలను అరికట్టవచ్చు. డిస్‌ప్లేలో ప్రెజర్‌తోపాటు టైం, టెంపరేచర్ కూడా చూపిస్తుంది. ప్రెజర్‌ని 0 నుంచి 87 పీఎస్‌ఐ వరకు గుర్తిస్తుంది. సెన్సర్‌లో కాయిన్ బ్యాటరీ వేయాల్సి ఉంటుంది.
ఒక బ్యాటరీ దాదాపు 2 సంవత్సరాలు పనిచేస్తుంది. ఇది వాటర్‌ప్రూఫ్‌తో రావడం వల్ల వర్షంలో కూడా పనిచేస్తుంది. దీన్ని బైక్‌లతోపాటు కార్ల ట్యూబ్, ట్యూబ్‌లెస్ టైర్లకు పెట్టుకోవచ్చు.
ధర: రూ. 2,699