- సిలిండర్ పేలిన ఘటనలో కాళ్లు కోల్పోయిన రవికుమార్, భాస్కర్
వెంకటియా తండాకు చెందిన ఆంగోతు రవికుమార్, తవిసిబోడుకు చెందిన తేజావత్ భాస్కర్ కాళ్లు పోగొట్టుకున్నారు. ఆటో నడుపుకుంటూ బతికే రవికుమార్ ఉపాధి కోల్పోయాడు. వ్యవసాయ పని చేసి బతికే భాస్కర్ బయటికి వెళ్లి పని చేయలేక కుటుంబాన్ని పోషించలేని దీనస్థితిలో ఉన్నాడు. గత ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న కేటీఆర్, పువ్వాడ అజయ్, అప్పటి ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా వచ్చి పరామర్శించారని, అండగా ఉంటామని చెప్పి హామీలు ఇచ్చి పట్టించుకోలేదని రవికుమార్, భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. వికలాంగుల పెన్షన్ కూడా రావడం లేదని, మూడు చక్రాల వాహనం ఇప్పిస్తామని చెప్పి పట్టించుకోలేదని వాపోయారు. అధికారుల చుట్టూ, గతంలో హామీలు ఇచ్చిన ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
