అయోధ్య రాంలల్లాకు ప్రాణ ప్రతిష్ఠ చేసిన పూజారి కన్నుమూత

అయోధ్య రాంలల్లాకు ప్రాణ ప్రతిష్ఠ చేసిన పూజారి కన్నుమూత

అయోధ్య రామ్​లల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని నిర్వహించిన వేద పండితుడు పండిట్ లక్ష్మీకాంత్ మధురనాథ్ దీక్షిత్ శనివారం ( జులై 22)న ఉదయం6.45 గంటలకు  కన్నుమూశారు.  86 ఏళ్ల వయస్సులో ఆయన హిందూ సమాజం పట్ల ఎంతో  భక్తి విశ్వాశాన్ని కలిగి ఉన్నారు. అయోధ్య రామ్​లల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమానికి నాలుగు వేదాల నుంచి ఎంపికైన 121 మంది పండితుల బృందానికి నాయకత్వం వహించారు.  వారణాసికి చెందిన మధురనాథ్​ దీక్షిత్​ 17వ శతాబ్దానికి చెందిన   ప్రముఖ కాశీ పండితుడు గాగా భట్  వారసుడు, . దీక్షత్​ వంశస్తులు  1674లో ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేకానికి నాయకత్వం వహించారు.

ఆచార్య దీక్షిత్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ   విచారం వ్యక్తం చేశారు. దీక్షిత్‌ మృతి సమాజానికి తీరని లోటు అని ఎక్స్‌పై పోస్ట్‌లో పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆచార్య దీక్షిత్ మృతికి సంతాపం తెలుపుతూ, “కాశీకి చెందిన ప్రముఖ పండితుడు మరియు శ్రీరామ జన్మభూమి ప్రాణ ప్రతిష్ఠా ప్రధాన అర్చకుడు వేదమూర్తి ఆచార్య శ్రీ లక్ష్మీకాంత దీక్షిత్ జీ మరణం ఆధ్యాత్మిక...  సాహిత్య రంగానికి పూడ్చలేని లోటని బాధా తప్త హృదయంతో పేర్కొన్నారు. ఆయన కూడా X  పోస్ట్‌లో, సంస్కృత భాష మరియు భారతీయ సంస్కృతికి దీక్షిత్ చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు.  ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని... ఆయన శిష్యులకు   ఈ దుఃఖాన్ని భరించే శక్తిని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.