ఉదయనిధి కామెంట్లను..సుమోటోగా తీసుకోవాలి: అర్చకులు రంగరాజన్

ఉదయనిధి కామెంట్లను..సుమోటోగా తీసుకోవాలి: అర్చకులు రంగరాజన్

చేవెళ్ల, వెలుగు: తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్లను సుప్రీం కోర్టు సుమోటోగా తీసుకొని విచారించాలని చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు రంగరాజన్ కోరారు. సోమవారం చిలుకూరు బాలాజీ ఆలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సనాతన ధర్మాన్ని ఉద్దేశిస్తూ ఉదయనిధి స్టాలిన్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడారన్నారు. 

ఇది శ్రీరాముడు, శ్రీ కృష్ణుడిని కించపర్చడమే అవుతుందని మండిపడ్డారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ.. ఇలాంటి కామెంట్లు చేయడం అవివేకమని విమర్శించారు. సనాతన ధర్మానికి వేల కోట్ల చరిత్ర ఉందన్నారు. వేదాలే దీనికి ఆధారమని చెప్పారు. ఉదయనిధిపై కఠిన చర్యలు తీసుకుంటేనే.. ఇలాంటి కామెంట్లు వేరేవాళ్లు చేయరని అన్నారు. సనాతన ధర్మాన్ని కించపర్చడం అంటే.. దేవుళ్లను, వేదాలను అవమానించడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు.