రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసిన మోడీ

రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసిన మోడీ

రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ విషయాన్ని రాష్ట్రపతి సెక్రటేరియట్ ట్వీట్ చేసింది. రాష్ట్రపతిగా కోవింద్ పదవీకాలం ఈ నెల (జూలై) 24తో ముగియనున్న కొద్ది రోజుల ముందు వీరి భేటి అవ్వడం గమనార్హం. ఈ నెల 18 న రాష్ట్రపతి ఎన్నికలు జరగనుండగా, 21న ఫలితాలు రానున్నాయి. రాష్ట్రపతిగా ఎన్నికైన వారు జులై 25న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును బలపరచగా, విపక్షాలు ఆమెకు పోటీగా యశ్వంత్ సిన్హా బరిలోకి దింపాయి. కాగా భారత రాజ్యాంగం ప్రకారం రహస్య బ్యాలెట్ పద్ధతిలోనే రాష్ట్రపతి ఎన్నికను నిర్వహిస్తారు. బ్యాలెట్‌ పేపర్‌ విధానంలోనే ఓటింగ్‌ జరుగుతుంది. రాష్ట్రపతి ఎన్నికకు జరిగే పోలింగ్‌లో ఎంపీలు పార్లమెంటు ప్రాంగణంలో, ఎమ్మెల్యేలు ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు.