మోదీపై అధిర్ రంజన్ సంచలన వ్యాఖ్యలు..మోదీ సూపర్ కౌంటర్

మోదీపై అధిర్ రంజన్ సంచలన వ్యాఖ్యలు..మోదీ సూపర్ కౌంటర్

లోక్‌సభలో మణిపూర్‌ అంశంలో  అధికార, విపక్షాల మధ్య పరస్పరం తీవ్రమైన ఆరోపణలు కొనసాగాయి. కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ సహా  విపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. అటు విపక్షాలపై బీజేపీ కూడా అంతే ధీటుగా ఎదురుదాడికి దిగింది.  ఈ నేపథ్యంలో లోక్‌సభలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌదరీ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి.  నీరవ్‌మోదీ ఎక్కడో బ్రిటన్‌లో లేడు..ఇక్కడే భారత్‌లోనే ఉన్నాడంటూ పరోక్షంగా నరేంద్రమోదీని ఉద్దేశించి విమర్శించారు.  మణిపూర్‌పై ప్రధాని మోదీ మౌనం మంచిదికాదన్నారు. అయితే  అధిర్‌రంజన్‌ వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు భగ్గుమన్నారు. ప్రధాని మోదీకి అధిర్‌రంజన్‌ క్షమాపణ చెప్పాలని డిమాడ్‌ చేశారు. ప్రధానిపై అధిర్ చేసిన వ్యాఖ్యలు  రికార్డుల నుంచి తొలగించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి డిమాండ్‌ చేశారు. దాంతో వాటిని రికార్డుల తొలగిస్తున్నట్టు స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు.

అధీర్ రంజన్ కి మోదీ కౌంటర్
అధీర్ రంజన్ చౌదరి వ్యాఖ్యల తర్వాత మాట్లాడిన ప్రధాని మోదీ.... ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అధిర్ ను  ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందని ప్రశ్నించారు, బహుశా  కోల్‌కతా నుంచి వచ్చిన పిలుపు కారణంగానా.. అంటూ కౌంటర్ ఇచ్చారు.  అధిర్ రంజన్ చౌదరికి సమయం ఇవ్వడానికి అమిత్ షా చేసిన సంజ్ఞను మోదీ  గుర్తుచేశారు. కాంగ్రెస్ చౌదరిని పక్కన పెట్టడం వెనుక కారణాలపై మోదీ ఉదాహరణగా పేర్కొంటూ.. కోల్‌కతా నుంచి కాల్ రావడమే కారణమంటూ ఎద్దేవా చేశారు.