ఇవాళ జర్మనీకి మోడీ

ఇవాళ జర్మనీకి మోడీ

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ శనివారం అర్ధరాత్రి జర్మనీ వెళ్తున్నారని, 26–27వ తేదీల్లో నిర్వహించే జీ–7 సమ్మిట్​లో హాజరవుతారని ఫారిన్​ సెక్రటరీ వినయ్​ క్వాత్రా శుక్రవారం వెల్లడించారు. జర్మనీ చాన్స్​లర్  ఓలాఫ్​ స్కోల్జ్​ ఆహ్వానం మేరకు మోడీ సమ్మిట్​లో పాల్గొంటారన్నారు. ఇండియాతో పాటు అర్జెంటీనా, ఇండోనేషియా, సెనెగల్, దక్షిణాఫ్రికా దేశాలకు కూడా గెస్ట్​ కంట్రీస్​గా జర్మనీ ఆహ్వానించినట్టు తెలిపారు. సదస్సులో భాగంగా జీ–7 దేశాధినేతలతో పాటు గెస్ట్​కంట్రీస్​ అధ్యక్షులతో కూడా ప్రధాని మోడీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని స్పష్టం చేశారు. పర్యావరణం, ఎనర్జీ, వాతావరణం, ఆహార భద్రత, హెల్త్​, జెండర్​ ఈక్వాలిటీతో పాటు డెమోక్రసీ అంశాలపై జీ–7 సదస్సులో చర్చిస్తారని తెలిపారు. సమ్మిట్​పూర్తయిన తరువాత 28వ తేదీన మోడీ జర్మనీ నుంచి యూఏఈ వెళ్తారని పేర్కొన్నారు. ఈ పర్యటనలో యూఏఈ కొత్త ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తో భేటీ అవుతారు. ఆ తరువాత  ఇండియాకు తిరిగి వస్తారని ఫారిన్​ సెక్రటరీ తెలిపారు.