ఒక్కరోజే మోడీతో భేటీ అయిన నలుగురు గవర్నర్లు

ఒక్కరోజే మోడీతో భేటీ అయిన నలుగురు గవర్నర్లు

ఈ రోజు(శ‌నివారం )  నాలుగు రాష్ట్రల గవర్నర్లు ప్రధాని  మోడీతో భేటీ అయ్యారు. ముందుగా ఉత్తరప్రదేశ్‌లోని జలాన్‌కు వెళ్లిన మోడీ అక్కడ కొత్తగా నిర్మించిన బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వేను ప్రారంభించారు. అనంతరం ఢిల్లీకి చేరుకున్నారు.  ఆ తరువాత వ‌రుస‌బెట్టి గ‌వ‌ర్నర్లతో భేటీ అయ్యారు. వీరిలో ప‌శ్చిమ బెంగాల్ గ‌వ‌ర్నర్ ధ‌న‌క‌ర్‌, మ‌ణిపూర్ గ‌వ‌ర్నర్ గ‌ణేశ‌న్‌, మ‌ధ్యప్రదేశ్ గ‌వ‌ర్నర్ మంగూభాయి ప‌టేల్‌, హిమాచల్ ప్రదేశ్ గ‌వ‌ర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేక‌ర్‌లు ఉన్నారు. గవర్నర్లు మోడీని కలిశారని ప్రధాని కార్యాలయం (పీఎంవో) ట్వీట్ చేసింది. రాష్ట్రపతి ఎన్నికలు వేళ గ‌వ‌ర్నర్లు ప్రధానితో  భేటీ అవ్వడం అసక్తిని సంతరించుకుంది.