గుజరాత్ తీర ప్రాంతాలను అభివృద్ధి చేశాం

గుజరాత్ తీర ప్రాంతాలను అభివృద్ధి చేశాం

సూరత్: గుజరాత్ లో అనేక తీరప్రాంతాలను అభివృద్ధి చేశామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. సొంత రాష్ట్రంలో పర్యటిస్తున్న మోడీ... భావ్ నగర్ లో రోడ్ షో నిర్వహించారు. ఆ తర్వాత పలు అభివృద్ధి పనులకు మోడీ శంకుస్థాపన చేశారు. అనంతరం సూరత్ లో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న మోడీ మాట్లాడారు. గుజరాత్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. బొగ్గు టెర్మినల్స్ యొక్క నెట్ వర్క్ ను అభివృద్ధి చేయడం ద్వారా పరిశ్రమల అవసరాలను తీర్చామని పీఎం అన్నారు. ప్రభుత్వం ఆక్వా సాగును నిరంతరం ప్రోత్సహిస్తోందని తెలిపారు.

గుజరాత్ తీర ప్రాంతం ఎగుమతులు, దిగుమతులతో ఉపాధిని సృష్టించగలిగామని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ఈ ఏడాది చివర్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. తన పర్యటనతో ఎన్నికల ప్రచారానికి నరేంద్ర మోడీ శ్రీకారం చుట్టారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.