పిల్లలతో మోదీ మ్యాజిక్!

పిల్లలతో మోదీ మ్యాజిక్!

న్యూఢిల్లీ:  నిత్యం అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉండే ప్రధాని నరేంద్రమోదీ గురువారం పిల్లలతో సరదాగా గడిపారు. పిల్లల్లో చిన్నపిల్లాడిలా మారి ఆడుతూ కన్పించారు. ఈ వీడియోను బీజేపీ తన ట్విటర్‌‌ ఖాతాలో షేర్‌‌ చేసింది. అటు మోదీ కూడా దాన్ని తన ఇన్‌‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. వీడియోలో ఓ పాప, బాబుతో ప్రధాని కనిపించారు. చిన్నారుల తలలను మోదీ ఒక్క దగ్గరకు తీసుకువచ్చి సున్నితంగా ఢీకొట్టారు. 

ఆ తర్వాత ఆయన మ్యాజిక్ తో తన నుదిటికి కాయిన్ అతికించుకున్నారు. అనంతరం చిన్నారుల నుదిటికి కూడా నాణేన్ని అతికించారు. వాళ్ల తల వెనుక భాగంలో నెమ్మదిగా కొట్టి కాయిన్ కింద పడేలా చేశారు. ఈ మ్యాజిక్ గేమ్ ను మోదీతోపాటు పిల్లలిద్దరు కూడా ఎంజాయ్ చేశారు. మోదీ తన పోస్టుకు ‘‘నా చిన్నారి మిత్రులతో కొన్ని గుర్తుండిపోయే క్షణాలు..! ’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌‌ మీడియాలో వైరల్‌‌గా మారింది.