హైదరాబాద్ లో ఘనంగా మోడీ పుట్టిన రోజు వేడుకలు 

హైదరాబాద్ లో ఘనంగా మోడీ పుట్టిన రోజు వేడుకలు 

హైదరాబాద్ లో ప్రధాని నరేంద్రమోడీ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎంజె మార్కెట్ చౌరస్తా లో ప్రధాని మోడీ భారీ ఫ్లెక్సీ కి క్రేన్  సాయంతో జాంబాగ్ కార్పొరేటర్ రాకేష్ జైస్వాల్  పాలాభిషేకం చేశారు. అనంతరం కార్యకర్తలు, ప్రజలకు  స్వీట్లు పంచి వేడుకలు జరుపుకున్నారు. దేశ్ కి నేత ప్రధాని మోడీ అంటూ.. కమలం పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు. 

మోడీ నాయకత్వంలో దేశం ఎంతో పురోగతి సాధించిందని కార్పొరేటర్ జైస్వాల్ అన్నారు. దేశ ఆర్ధిక వ్యవస్థ కుదేలైనా తిరిగి గాడిలో పెట్టిన ఘనత ప్రధానికే దక్కుతుందని తెలిపారు. ప్రజల కోసం, దేశం కోసం ఆలోచన చేసే మోడీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.