రామానుజాచార్య అడుగు జాడల్లో  మోడీ నడుస్తున్నారు

రామానుజాచార్య అడుగు జాడల్లో  మోడీ నడుస్తున్నారు

హైదరాబాద్: సర్వ మానవ సమానత్వానికి శ్రీ రామానుజాచార్యులు ప్రతీక అని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. మనుషులంతా సమానమేనని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో నిర్మించిన 216 అడుగులు రామానుజాచార్యుల విగ్రహాన్ని ఇవాళ సాయంత్రం ప్రధాని మోడీ జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ దైవం ముందు మనుషులు అందరూ ఒకటేనని చెప్పిన మహాత్ముడు రామానుజాచార్యులు అని అన్నారు. ఎన్నో సంవత్సరావులుగా శ్రమించి చిన్నజీయర్ స్వామి ఈ క్షేత్రాన్ని నిర్మించారని అన్నారు. ఈ రోజు హిందువులంతా గర్వపడుతున్నారని అన్నారు. 

రామానుజాచార్యుల అడుగుజాడల్లోనే ప్రధాని నరేంద్ర మోడీ నడుస్తున్నారని, దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలను సమానంగా చూస్తూ ఆయన పరిపాలన చేస్తున్నారని కిషన్‌ రెడ్డి అన్నారు. స్టాట్యూ ఆఫ్  యూనిటీ, స్టాట్యూ అఫ్ ఈక్వాలిటీ .. రెండు విగ్రహాలు దేశానికి తలమానికంగా నిలుస్తాయన్నారు. కేంద్ర ప్రభుత్వం తరపున ముచ్చింతల్‌  క్షేత్రానికి అన్ని రకాలుగా మద్దతు ఉంటుందని చెప్పారు.

మరిన్ని వార్తల కోసం..

ఈ యాగ ఫలితం ప్రతి భారతీయుడికీ దక్కాలి

గ్యాస్ సిలిండర్ రూ.500 కంటే తక్కువకే ఇస్తం

యూపీ సీఎం యోగి వద్ద కోటిన్నర ఆస్తులు, రివాల్వర్‌‌, రైఫిల్