హైదరాబాద్లో ప్రైమ్ వాలీబాల్ లీగ్

హైదరాబాద్లో ప్రైమ్ వాలీబాల్ లీగ్

హైదరాబాద్, వెలుగు: ప్రైమ్ వాలీబాల్ లీగ్ ఫస్ట్ సీజన్ లో పోటీపడే హైదరాబాద్ బ్లాక్ హక్ టీమ్ కెప్టెన్ గా ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన విపుల్ కుమార్ ఎంపికయ్యారు. ఈ విషయాన్ని టీమ్ ఓనర్ అభిషేక్ రెడ్డి మంగళవారం జరిగిన వర్చువల్ మీడియా సమావేశంలో వెల్లడించారు. కెప్టెన్గా ఎంపిక కావడంపై విపుల్ స్పందిస్తూ తనపై నమ్మకం ఉంచిన ఫ్రాంచైజీకి థ్యాంక్స్ చెప్పారు. లీగ్ లో టీమ్ ను సక్సెస్ ఫుల్ గా నడిపేందుకు కృషి చేస్తానన్నాడు. ఈ నెల 5 నుంచి 27 వరకు హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఈ మెగా లీగ్ జరగనుంది. ఫస్ట్ డే కొచ్చి బ్లూ స్పైకర్స్ తో హైదరాబాద్ తమ పోరు ఆరంభించనుంది.