
హైదరాబాద్/నల్గొండ, వెలుగు : ఎస్‌ఎల్‌బీసీ మెయిన్ కెనాల్ లైనింగ్ పనులకు ప్రభుత్వం రూ. 442 కోట్లు మంజూరు చేసింది. మెయిన్ కెనాల్‌లోని 23.5 కిలోమీటర్ నుంచి 136.150 కిలోమీటర్ వరకు సిమెంట్ కాంక్రీట్ లైనింగ్ పనులకు ఆమోదముద్ర వేస్తూ ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
లైనింగ్ పనులకు సరైన డ్రాయింగ్స్ తీసుకోవాలని, సైట్ కండిషన్‌కు తగ్గట్టు డ్రాయింగ్స్ ఉండాలని సూచించారు. సాయిల్ క్లాసిఫికేషన్ చేయించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిధుల మంజూరు చేయించడం పట్ల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.