రష్యా-, ఉక్రెయిన్ మధ్య రెండో రోజూ ఖైదీల మార్పిడిరష్యా-, ఉక్రెయిన్ మధ్య రెండో రోజూ ఖైదీల మార్పిడి

రష్యా-, ఉక్రెయిన్ మధ్య రెండో రోజూ ఖైదీల మార్పిడిరష్యా-, ఉక్రెయిన్ మధ్య రెండో రోజూ ఖైదీల మార్పిడి

కీవ్: రష్యా, ఉక్రెయిన్ మధ్య రెండో రోజు శనివారం కూడా యుద్ధ ఖైదీల మార్పిడి కొనసాగింది. 307 మంది చొప్పున రెండు దేశాలు యుద్ధ ఖైదీలను విడుదల చేశాయి. శుక్రవారం(మొదటి విడత) 390 మంది(270–సైనికులు, 120– పౌరులు) చొప్పున సైనికులను మార్చుకున్నామని.. అదేతరహాలో శనివారం కూడా యుద్ధ ఖైదీల అప్పగింత కొనసాగిందని ఉక్రెయిన్, రష్యా వెల్లడించాయి. మొత్తం మూడు రోజుల్లో 1,000 మంది ఖైదీల మార్పిడి పూర్తవుతుందని పేర్కొన్నాయి. ఈ మార్పిడి ఉత్తర ఉక్రెయిన్‌‌లోని బెలారస్ సరిహద్దు వద్ద జరిగింది. 

విడుదలైన రష్యన్ సైనికులను వైద్య చికిత్స, మానసిక సహాయం కోసం బెలారస్‌‌కు తరలించారు. అయితే, ఈ మార్పిడి జరిగిన కొన్ని గంటల ముందు.. రష్యా కీవ్‌‌పై 14 బాలిస్టిక్ మిస్సైళ్లు, 250 షహీద్ డ్రోన్‌‌లతో దాడి చేసింది. ఈ దాడిలో 15 మంది గాయపడ్డారు. ఒబోలోన్ జిల్లాలో ఒక రెసిడెన్షియల్  బిల్డింగ్ తీవ్రంగా దెబ్బతిన్నది. కాగా.. ఇస్తాంబుల్‌‌లో మే 16న జరిగిన చర్చల్లో ..ఉక్రెయిన్, రష్యా దేశాలు 1,000 మంది యుద్ధ ఖైదీలను మార్పిడి చేసుకోవడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇది మూడేండ్ల యుద్ధంలో అతిపెద్ద ఖైదీల మార్పిడిగా నిలిచింది.