గచ్చిబౌలి: ప్రైవేట్ బస్సులో చెలరేగిన మంటలు..పరుగులు తీసిన ఐటీ ఉద్యోగులు

గచ్చిబౌలి:  ప్రైవేట్ బస్సులో చెలరేగిన మంటలు..పరుగులు తీసిన ఐటీ ఉద్యోగులు

హైదరాబాద్ లోని   గచ్చిబౌలిలో జులై 29న ఉదయం పెను ప్రమాదం  తప్పింది.  ఐటీ ఉద్యోగులను తీసుకెళ్తున్న ప్రైవేట్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సు  డ్రైవర్  అప్రమత్తమై వెంటనే ఐటీ ఉద్యోగులను కిందికి దింపడంతో ప్రమాదం తప్పింది. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తచ్చారు.  ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరు ఊపిరిపీల్చుకున్నారు.   

ఈ  ప్రమాదంలో బస్సు లోపలి భాగం పూర్తిగా ధ్వంసం అయ్యింది. ఉద్యోగులను ఇతర బస్సులో అక్కడి నుంచి పంపించారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంపై వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు.